వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెస్ హైకమాండ్‌ను పొగుడుతోందా.. లేదా ఎగతాళి చేస్తోందా..? అన్న సందేహాన్ని నెల్లూరులోని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాలో ఓదార్పు ముగించుకున్న జగన్, నెల్లూరులో చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్సార్ అండ్ సన్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన హోర్గింగులు జెండాలు దర్శనమిస్తున్నాయి.
ఈ ఏర్పాట్లన్నిటినీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు కాంగ్రెస్ బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫ్లెక్సీలను, జెండాలను చూసిన ఓ విలేకరి శ్రీధర్ రెడ్డితో... అన్నిచోట్లా వైఎస్సార్, జగన్ తప్ప మరెవరూ కనిపించడం లేదెందుకని...? అని అడిగారు కోటం సమాధానమిస్తూ... సోనియా- రాహుల్ గాంధీల బొమ్మలను తాము వాడుకుంటే అక్రమంగా వారి ఫోటోలను వాడుకున్నామని తమపై ధ్వజమెత్తే అవకాశముందన్నారు. అందువల్లనే వారి ఫోటోలు లేకుండా ఇలా తయారు చేయించానని కోటం శ్రీధర్ రెడ్డి చెప్పాడు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment