రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా పొరపాటునో.. గ్రహపాటునో తాను ముఖ్యమంత్రిని అయ్యానని సీఎం కొణిజేటి రోశయ్య అన్నారు. అంతమాత్రానా మీకున్నంత పరిజ్ఞానం, ఫింగర్‌టిప్స్‌పై గణాంకాల వివరాలు ఉండాలని ఉందా అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాపై మండిపడ్డారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలు ఆయనను తీవ్ర అసహనానికి గురి చేసింది. దీంతో ఆయన మీడియాపై చిర్రుబుర్రులాడారు.
డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఫైలు తన టేబుల్‌పైకి వచ్చిన ఐదు నిమిషాల్లో సంతకం చేసి మంత్రి కార్యాలయానికి పంపినట్టు తెలిపారు. మిగిలిన వివరాలు ఏవైనా ఉంటే ఆయనను అడిగి తెలుసుకోండి అంటూ కోపగించుకున్నారు.
ముఖ్యమంత్రి సీటులో ఉన్నంత మాత్రాన అన్ని విషయాలు తెలియాలనే రూలు ఉందా అంటూ ప్రశ్నించారు. దానికో మంత్రి ఉన్నారని, ఆయనను అడిగి మిగిలిన వివారాలు తెలుసుకోవచ్చన్నారు. అంతేకానీ, అన్ని సమస్యలకు, ప్రశ్నలకు ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలనే కోరడం సబబు కాదన్నారు.

0 comments:
Post a Comment