కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప సోమవారం బలపరీక్షను ఎదుర్కోనున్నారు. తన మంత్రివర్గంలోని అవినీతి మంత్రులపై చర్య తీసుకున్నందుగాను సొంత పార్టీకి చెందిన 13 ఎమ్మెల్యేలతో పాటు.. మొత్తం 19 మంది సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే.
అసమ్మతి సభ్యులతో ఆ రాష్ట్ర మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి జరిపిన చర్యలు ఫలించడంతో కొంతమంది రెబల్ అభ్యర్థులు తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, 11 మంది సభ్యులు మాత్రం యడ్యూరప్ప సర్కారుకు మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
వీరికి జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పూర్తి అండదండగా నిలుస్తున్నారు. వీరిని గోవా నుంచి చెన్నయ్‌కు తరలించి మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు.
ఆయన సర్కారు కొనసాగాలంటే మొత్తం 113 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. అయితే, 11 మంది సభ్యులు తిరుగుబాటు చేయడం, కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా ఆయా పార్టీలు విప్ జారీ చేయడంతో యడ్యూరప్ప సర్కారు ప్రమాదం అంచున ఉంది.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment