అయోధ్య విషయాన్ని సామరస్యంగా పరిష్కరించాలని పాత కక్షిదారు హషీం అన్సారీ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదంలో బాహ్యశక్తులు, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకుండా ఉంటే సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతుందని అన్సారీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రామజన్మభూమి, బాబ్రీ మసీదు సమస్య వివాదాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్సారీ వెల్లడించారు. హిందూ, ముస్లిమ్, సిక్కు, క్రైస్తవులు అన్నదమ్ములు అనే సందేశాన్ని ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
కానీ అయోధ్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి బాహ్యశక్తులు ఇష్టపడటం లేదని అన్సారీ వెల్లడించారు. ఈ వివాదం సామరస్య పూర్వకంగా ముగిస్తే ప్రపంచానికి శాంతి, సమగ్రతా సందేశం అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

0 comments:
Post a Comment