Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Friday, October 15, 2010

పాకిస్థాన్ ప్రధానిపై హత్యాయత్నం: భగ్నం చేసిన పోలీసులు

పాకిస్థాన్ తీవ్రవాదులు ఆ దేశాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ఉంది. ఏకంగా పాక్ ప్రధానినే హత మార్చడానికి ఆయన ఇంటి సమీపంలో బాంబు దాడికి ప్రయత్నించిన తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా వీరి హిట్‌లిస్ట్‌లో గిలానితో పాటు విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి, ఓ సీనియర్‌ పోలీసు అదికారి, మరో సైనికాధికారి, ఇంకా ఇతర ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు వీరిని హతమార్చేందుకు తీవ్రవాదుల పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సెంట్రల్‌ పాకిస్తాన్‌లో ఏడుగురు సభ్యులున్న తీవ్రవాద ముఠాను అరెస్ట్‌ చేయడంతో ఈ గుట్టురట్టయ్యింది. ఈ ఏడుగురు తీవ్రవాదులు అల్‌ ఖైదా తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న లష్కర్‌ ఎ ఝంగ్వీ అనే నిషిద్ధ సున్నీ తీవ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
సెంట్రల్‌ పాకిస్తాన్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో వీరిని అరెస్ట్‌ చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి అబిద్‌ ఖాద్రి తెలిపారు. ఈ హత్యాయత్నం కుట్రకు సంబంధించిన ప్రాధమిక విచారణ ప్రారంభించామని, పాకిస్థాన్‌ ప్రధానితో సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు వీరు పథకం వేశారని విచారణలో వెల్లడైనట్లు ఆయన చెప్పారు.
తమ రోజువారీ విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండా తీవ్రవాదులు పట్టుబడ్డారని ఆ సమయంలో వారు కాల్పులు ప్రారంభించారని ఖాద్రి తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, మరణించలేదని 
ఆయన పేర్కొన్నారు.

0 comments:

Post a Comment