మైక్రో ఫైనాన్స్ సంస్థలతో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీలకు ఎలాంటి సంబంధం లేదని అనంతపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలతో రాహుల్, సోనియాలకు సంబంధముందని విపక్షాలు చేస్తున్న విమర్శలను జేసీ కొట్టిపారేశారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు రాష్ట్రంలో శృతిమించిపోతున్నాయని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని జేసీ కోరారు. మైక్రో సంస్థల ఆగడాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు
అలాగే మంత్రివర్గ విస్తరణ గురించి జేసీ మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభానికి మంత్రివర్గ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో తనకు తెలియదని, అయితే మంత్రి వర్గ విస్తరణకు చాలా రోజులు అయినందున విస్తరణ ఉంటేనే మంచిదని జేసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment