Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget
Showing posts with label Sports. Show all posts
Showing posts with label Sports. Show all posts

Sunday, April 3, 2011

ఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయి వీక్షకులు

న్యూఢిల్లీ: భారత, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో క్రికెట్ అభిమానులు వీక్షించారు. 67.6 మిలియన్ వీక్షకులు ఈ మ్యాచ్‌ను చూడటానికి టెలివిజన్ సెట్లకు అత్తుకుపోయారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ రేటింగ్ అని ఆడియన్స్ మెజర్‌మెంట్ అండ్ అనలిటికల్ లిమిటెడ్ తెలిపింది. ఫైనల్ మ్యాచ్‌కు 13.7 పాయింట్ల రేటింగ్‌ను నమోదు చేసుకుంది. ఓ దశలో రేటింగ్ 21.44 పాయింట్లకు చేరుకుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు అత్యధికంగా చూసిన మ్యాచ్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను చూసిన వారిలో అత్యధికంగా 64 శాతం మంది ఇంటి వద్ద నుంచే చూసినట్టు గణాంకాలు వెల్లడించాయి.
source:sakshi