Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, October 18, 2010

ఔట్‍‌సోర్సింగ్‌ అంశంపై మరోసారి మండిపడ్డ ఒబామా

ఒబామాకు కోపం వచ్చింది. ఔట్‌సోర్సింగ్ అంశంలో తమ దేశ రిపబ్లికన్లు వ్యవహరిస్తున్న తీరుపై ఒబామా మండిపడ్డారు. విదేశాల్లో పెట్టుబడులు పెడుతూ, అక్కడి ప్రజలకే అధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న వివిధ కంపెనీలకు రిపబ్లికన్లు మద్దతిస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా దుయ్యబట్టారు.
వచ్చే నవంబర్‌లో అమెరికన్ కాంగ్రెస్‌కు జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఒబామా తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఒబామా ప్రసంగిస్తూ.. తమ దేశ ప్రజలకే ఉద్యోగావకాశాలు కల్పిస్తూ పర్యారణ మిత్రులుగా వ్యవహరించే దేశాలకు పన్నుల్లో రాయితీలు కల్పించడమే కాకుండా తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న పన్నుల విధానంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని, వివిధ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా విదేశాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి విధానాన్ని అరికట్టేందుకు వీలుగా పన్నుల చట్టాన్ని సవరిస్తామని ఒబామా అన్నారు. కొత్తగా అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు తమ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రోత్సాహం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

0 comments:

Post a Comment