తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలకు తగిన బుద్ధి చెపుతామని ఉస్మానియా విశ్వవిద్యాలయ జేఏసీ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీని, తమను కించ పరిచే విధంగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు లింగస్వామి, భాస్కర్, బాలలక్ష్మి, రవీంద్రనాయక్‌లు హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత మేధావులు, ఉద్యమకారులను అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఇలాంటి వారికి తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెపుతామన్నారు.
ఇదిలావుండగా, నవంబరు ఒకటో తేదీన ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఆంధ్రారష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ మంగళవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఓయూ జేఏసీ నేతలు సచివాలయం మెయిన్‌గేటు పైకి ఎక్కి లోనికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment