వెండితెరపై మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక కాస్త లావయ్యారన్న సంగతి తెలిసిందే. తనను కలవడంకోసం ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్న నేపధ్యంలో వారందరినీ పలు కార్యక్రమాల్లో కలిసే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్న చిరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తన తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు సూచన మేరకు అమెరికాలో కొవ్వును కరిగించుకునే చికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్స వల్ల మెగాస్టార్ కాస్త సన్నబడ్డారు.
దీని ఫలితంగా కాస్త నీరసంగానూ మారాడు. ప్రస్తుతం కొన్ని రోజులపాటు ట్రీట్‌మెంట్ ప్రభావం ఉంటుందని బయట ఎక్కువగా తిరగకూడదలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. రోజుకు 2 ఇడ్డెనలు ఉదయంపూట అల్పాహారంగా తీసుకోవాలని, రాత్రిళ్లు చపాతీలు తినాలని ఆయన మెనూలో ఉంది. ఇక జ్యూస్‌లు మామూలే.
మొత్తమ్మీద తన తదుపరి చిత్రం కోసం చిరంజీవి బాగా కసరత్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల నాటకి పవర్‌ఫుల్ సబ్జెక్టున్న చిత్రాన్ని ప్రజల ముందు ఉంచడం ద్వారా మరింత చేరువు కావాలన్నది ఆయన యోచనగా ఉన్నట్లు సమాచారం.
కాగా సినిమా కథ.. పొలిటికల్ టచ్‌తో ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి రాజ్యమేలుతోందనీ, నాయకులు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తూ తిరిగి వారికి అందులో చిటికెడు భాగం విదిలిస్తూ ఎలా తమవైపు తిప్పుకుంటున్నారో తూర్పారబట్టనున్నట్లు భోగట్టా.
ఇంకా ఈ చిత్ర కథలో ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ స్టంట్, కుర్చీకోసం జరుగుతున్న లోపలి యుద్ధం తదితర అంశాలన్ని చొప్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిద్వారా రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని ఎలా దోచుక తింటున్నారో తెలియజేయాలనుకుంటున్నట్లు భోగట్టా. అయితే సెట్‌పైకి వెళ్లే అసలు కథ ఏమిటో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..!!
0 comments:
Post a Comment