వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుకు వచ్చే అందరినీ కలుపుకుని ముందుకు పోతామన్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య పనితీరు బాగావుందన్నారు. అందువల్ల ఆయన మార్చాల్సిన పని లేదన్నారు. కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న వ్యక్తిగత ఓదార్పు యాత్రపై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సజావుగా సాగుతోందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దిక్కతోచకనే రాష్ట్ర పర్యటనలు జరుపుతున్నారన్నారు. తన ఇమేజ్‌ను ఏ విధంగా కాపాడుకోవాలనే తపన ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. గద్దర్ నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌తో కూడా సంప్రదింపులు జరిపి ముందుకెళతామని చెప్పారు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment