అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల పట్టికలో భారత పరుగుల యంత్రం సచిన్ టెండూల్కర్ సుదీర్ఘకాలం తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. స్వదేశంలో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండు టెస్టుల్లో సచిన్ అద్భుతంగా రాణించాడు. తొలి టెస్టులో ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా, రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ, ఒక అర్థసెంచరీతో మొత్తం 403 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ పరిస్థితుల్లో బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్ జాబితాలో మాస్టర్ 891 పాయింట్లతో తొలి స్థానం దక్కించుకున్నాడు. సచిన్ జోరుకు మొదటిస్థానంలో ఉన్న శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర (874)ను వెనక్కి నెట్టాడు. దీంతో సంగక్కర రెండో స్థానానికి పరిమితం కాగా, భారత డాషింగ్ ఓపెనర్ 819 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇకపోతే.. జట్ల విషయానికి వస్తే టీమ్ ఇండియా తన నంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఆసీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి మరో మూడు పాయింట్లను ఖాతాలో వేసుకున్న భారత్, మొత్తం 130 రేటింగ్ పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మరోవైపు నాలుగోస్థానంతో భారత పర్యటనను ఆరంభించిన పాంటింగ్ సేన తాజా పరాభవంతో 110 పాయింట్లతో ఐదోస్థానానికి దిగజారింది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంత తక్కువ ర్యాంకుకు పడిపోవడం ఆసీస్‌కిదే తొలిసారి కావడం గమనార్హం. ద్వితీయ స్థానంలో దక్షిణాఫ్రికా (119), మూడో స్థానంలో శ్రీలంక (115), నాలుగో స్థానంలో ఇంగ్లండ్‌లు ఉన్నాయి.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment