Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, October 13, 2010

సాక్షి ఇంజనీరింగ్ వెబ్‌పోర్టల్ ప్రారంభం

ఏముంటాయి?
రాష్టవ్య్రాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కెరీర్‌కు ఉపయోగపడే సిలబస్ మెటీరియల్, స్కాలర్‌షిప్స్, దేశవిదేశాల్లో విద్యావకాశాలు, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్‌స్కిల్స్, టాప్ కంపెనీల ఇన్ఫర్మేషన్, కెరీర్లో విజయాలు సాధించిన విజేతల అభిప్రాయాలు, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్, సివిల్స్,గేట్, పరీక్షల సమాచారం, ఐఐఐటీలు, ఐఐటీలు, ఎన్‌టీల సమాచారం, విద్యార్థులకు సిలబస్ వారీగా మాక్‌టెస్టులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే విధానం,ప్లేస్‌మెంట్ ఆఫీసర్లతో ఆర్టికల్స్, కెరీర్ కౌన్సిలర్ల గెడైన్స్ ఇతరత్రా సమస్త సమాచారం. 

ఎప్పుడు ప్రారంభమైంది? సోమవారం, రాష్ట్ర ఉన్నతవిద్యామండలి మాజీ ఛైర్మన్ కేసీరెడ్డి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ లక్ష్మినారాయణ చేతులమీదుగా.
ఎవరికి ఉపయోగం? 

ఇంజనీరింగ్ చదివే విద్యార్థులందరికీ.
ఏమిటీ దీనిప్రత్యేకత? 

రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ వర్సిటీలు, కాలేజీల సమాచారం, ప్రముఖ కంపెనీల్లో పనిచేసే సీఈవోలు, హెచ్‌ఆర్ హెడ్‌ల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు, టాప్ కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్లతో రాయించిన సబ్జెక్ట్ మెటీరియల్ తదితర సమాచారం ఈ వెబ్ పోర్టల్ ప్రత్యేకం.

0 comments:

Post a Comment