* హత్య కేసులో నలుగురి పేర్లు భాను వెల్లడించాడు
* భానును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తాం
* ప్రతి చోట పబ్లిక్ ఫోన్ వాడాడు
* భాను తిరిగిన అన్ని ప్రదేశాల్లో విచారణ చేస్తాం
* భాను చెప్పిన విషయాలు వంద శాతం నమ్మలేం
* మూడున్నర గంటలుగా భానును విచారిస్తున్నాం
* డబ్బులు తీసుకునేందుకు జహీరాబాద్‌వచ్చాడు
* భాను ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్లు వాడలేదు
* ఇంటర్నెట్, డిష్ టీవీలో తెలుగు ఛానెల్స్ చూసేవాడు
* గత నెల నుంచి పాండిచ్చేరిలో భాను
* మలిశెట్టి భాను కిరణ్‌పై 15 కేసులు
* సూరి కేసు సహా 9 కేసులు సిఐడి ఇన్వెస్టిగేషన్
* 10 గంటలకు జహిరాబాద్ శివారులో అరెస్ట్
* రివాల్వర్ స్వాధీనం చేసుకున్నాం-సిఐడి డిజి రమణ మూర్తి
* ఆర్థిక స్పర్థల వల్లె సూరి హత్య
* అంతు చూస్తా అన్నందుకే సూరిని భాను చంపాడు-సిఐడి
* మధ్య ప్రదేశ్‌లో ఇల్లు ను అద్దెకు తీసుకున్న భాను
* వివిధ రాష్ట్రాలకు మకాం మార్చిన భాను
* మారుపేర్లతో మధ్య ప్రదేశ్‌నుంచి డ్రైవింగ్ లెసెన్స్, పాన్ కార్డ్, సిమ్ కార్డ్
అంతుచూస్తానని బెదిరించినందువల్లే మద్దెలచెర్వు సూరిని హత్య చేశానని భాను కిరణ్ చెప్పాడని సీఐడీ ఐజీ రమణమూర్తి తెలిపారు. అందరిముందు కించపరచడం, నీ పనిఅయిపోయింది అంటూ హెచ్చరించడం వల్లే సూరిని చంపినట్టు అంగీకరించాడన్నారు. డబ్బు కోసం జహీరాబాద్‌కు వచ్చి అతడు పట్టుబడ్డాడని చెప్పారు. ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో జహీరాబాద్ సరిహద్దులో అతడిని అరెస్ట్ చేశామన్నారు. భానుకిరణ్‌ను ప్రశ్నించిన తర్వాత సాయంత్రం అతడిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. సూరి హత్య తర్వాత పరారయిన భాను మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గోవాల్లో తిరిగాడన్నారు. మారు పేర్లతో రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు పొందాడన్నారు.
ఒక్క మధ్యప్రదేశ్‌లోనే సిమ్‌కార్డ్ ఉపయోగించాడని, మిగతా ప్రాంతాల్లో పబ్లిక్ ఫోన్ వినియోగించాడన్నారు. అతడిపై మొత్తం 15 కేసులు ఉన్నాయని తెలిపారు. సూరిని హత్య చేసిన తర్వాత పారియేందుకు రూ. 4 లక్షలు సిద్ధం చేసుకున్నాడన్నారు. అతడి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వర్‌ను పరీక్షకు పంపుతామన్నారు. నిఘావర్గాల సమాచారంతోనే భానుకిరణ్‌ను పట్టుకున్నామని రమణమూర్తి వెల్లడించారు. ఇంటరాగేషన్‌లో భాను చెప్పిన వియాలను నిర్ధారణ చేసుకోవాల్సి ఉందన్నారు. అతడి కోర్టులో ప్రవేశపెట్టి తమ రిమాండ్‌కు అప్పగించాలని అడుగుతామన్నారు.
0 comments:
Post a Comment