మైక్రో ఫైనాన్స్ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ చట్టాన్ని సవరించాలని బాబు కోరారు. మైక్రో ఫైనాన్స్ పేరిట ప్రైవేట్ మాఫియా ఏర్పడి పేదల రక్తం పీల్చుస్తోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు.
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌ల వల్ల మైక్రో ఫైనాన్స్ వలలో పేదలు చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్‌లను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలనుకోవడం, మారిటోరియం విధించడం వంటి కంటి తుడుపు చర్యలు మాత్రమేనని చంద్రబాబు విమర్శించారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకుందని బాబు ధ్వజమెత్తారు. కానీ మైక్రో ఫైనాన్స్ సమస్యలకు ఆర్డినెన్స్ జారీ వంటివి పరిష్కారం కాదని బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ రుణాలను మాఫీ చేసేంతవరకు పోరాటం సాగిస్తామని బాబు అన్నారు

0 comments:
Post a Comment