మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ నటించిన 'ఆరెంజ్' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి శిల్పాకళా వేదికలో జరిగింది. అయితే హీరోహీరోయిన్లు షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉండడంతో షూటింగ్‌కు ఇబ్బంది కలిగి విడుదలకు ఆలస్యమవుతుందని చరణ్ లేకుండా ఆడియో విడుదల చేస్తున్నామని చిరంజీవి చెప్పారు. చెప్పిన సమయానికి గంటన్నర ఆలస్యంగా జరిగిన వేడుకలో చిరంజీవి ఎక్కువసేపు మైక్‌లో మాట్లాడడం అభిమానులకే కాస్త చికాకు పుట్టించింది.
ఎప్పుడూలేని విధంగా ఆయన మాట్లాడే తీరు ప్రిపరేషన్‌గా వచ్చినట్లు అర్థమయింది. ఒకవైపు దాసరిని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తూ, మరోవైపు బాలకృష్ణను పొగుడుతూ ప్రసంగం సాగడం విశేషం. అలాగే బ్లడ్‌బ్యాంక్‌పై విమర్శలు కురిపించిన రాజశేఖర్ దంపతుల్ని కూడా ఇన్‌డైరెక్ట్‌గా చురక వేశారు.
అవార్డులు తెచ్చుకోకూడదు
నేను 'రుద్రవీణ', 'ఆపద్భాంధవుడు' సినిమాను నా అభిరుచి మేరకు చేశాను. అయితే అవార్డులు మాత్రమే వచ్చాయి. నందీ అవార్డులు మనం తెచ్చుకోకూడదు. వాటంతట అవే మన వద్దకు రావాలి. ఈ అవార్డులు శాశ్వతం కాదు. దానికంటే ప్రేక్షుల అభిమానం గొప్పది.
చరణ్ మథనపడేవాడు
'మగధీర' చిత్రం తర్వాత ఆదరణ చూసి చరణ్ చాలా మథనపడేవాడు. అభిమానులకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోనని. ఇంత ఆదరణ పొందిన చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని మథనపడ్డాడు. తను పడిన మానసిక సంఘర్షణ నాకు తెలుసు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. సూపర్‌స్టార్ అనేది ఊరికేరాదు. కష్టపడాలి. రజనీకాంత్ రోబో చేయకపోతే ఇంత పేరు వచ్చేదా.. అని సూచించాను. నేను 250 అడుగుల పై నుంచి బంగీ జంప్ చేస్తే.. ఇందులో రామ్‌చరణ్ 4వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేశాడు. ఇంట్లో అంతా కంగారుపడ్డాం. అభిమానుల ఆశీస్సులున్నాయి. అవిచాలు.
సింహా గ్రేట్ హిట్
ఎన్నోసినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు నిర్మాతలకు లాభం చేకూర్చుతాయి. మరికొన్ని డిస్ట్రిబ్యూటర్లకు. ఇంకొన్ని ఎగ్జిబిటర్లుకు. మగధీర తర్వాత అంతటి రేంజ్ హిట్ ఇచ్చిన చిత్రం 'సింహా'. అందరికీ లాభాల్ని చేకూర్చిన చిత్రమదని అన్నారు.
బ్లడ్‌బ్యాంక్‌లో తప్పులేదు
ఆ తర్వాత బ్లడ్‌బ్యాంక్‌లో అవినీతి జరుగుతున్నట్లు కొందరు ఆక్షేపించారు. దానిపై ఉన్న అపప్రధ పోవడానికి ప్రభుత్వాన్ని పరిశీలించమని విన్నవించాను. దానిపై ఈరోజు నివేదిక వచ్చింది. నిష్పక్షపాతంగా బ్లడ్‌బ్యాంక్ సేవలను కొనియాడుతూ వచ్చిన రిపోర్ట్ విమర్శల పాలిట చెంపపెట్టు.. అంటూ.. బ్లడ్‌బ్యాంక్‌కు రక్తం దానంచేసిన వారిని సన్మానిస్తూ వారిచేత వందనాలు స్వీకరించారు చిరంజీవి.
ఇక రామ్‌చరణ్ ఆస్ట్రేలియాలోనుంచి టెలికాన్ఫెరెన్స్ లైవ్‌లో చూపించారు. నేను షూటింగ్ నిమిత్తం ఇక్కడ ఉన్నాను. హారీస్ జైరాజ్ వెంకటేష్‌తో చేసిన వాసు చిత్రం పాటలు విన్నప్పటి నుంచి అతని ఫ్యాన్ అయ్యాను. పాటలు అన్నీ ఎంజాయ్ చేసేట్లుగా ఉన్నాయి. దర్శకుడు భాస్కర్ సినిమాను బాగా తీశాడు. మగధీర తర్వాత వస్తున్న ఆరెంజ్‌ను అంత డెడికేషన్‌తో చేస్తున్న చిత్రమిది. మగధీర తర్వా ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నానో అది ఈ చిత్రంతో నెరవేరింది అన్నారు.
జెనీలియా కూడా అక్కడనుంచే మాట్లాడుతూ...మంచి మ్యూజికల్ లవ్‌స్టోరీ. అందరూ ఎంజాయ్ చేసేట్లుగా ఉంటుంది అన్నారు. ఈ చిత్ర ఆడియోను రామానాయుడు విడుదల చేసి చిరంజీవికి అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబమంతా పాల్గొంది. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ పాల్గొనడం అక్కడి వారిని ఆకర్షించింది.

0 comments:
Post a Comment