తెలుగు సినిమా తీయను...' అంటూ అలిగి బొంబాయి వెళ్లిపోయిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ. మళ్లీ ఎందుకొచ్చారు...అని అడిగితే...'మాట మీద నిలబడే అలవాటు నాకు లేదు' అని గడుసుగా సమాధానం ఇచ్చాడు. కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : అప్పల్రాజు అనే సినిమాను కూడా మొదలెట్టేశాడు. ఈ కథ ఒకవిధంగా వర్మ ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చు.ఎలాంటి డిప్లొమసీ లేకుండా టాలీవుడ్ గురించి అనేక విషయాలు ఇందులో చెప్పదల్చుకున్నాడు. తెలుగు పరిశ్రమలో తనకు నచ్చని వ్యక్తుల మీదా, అంశాల మీదా వ్యంగ్యంగా ఈ చిత్రాన్ని ప్రయోగించబోతున్నాడు. అందులో భాగంగానే ఓ పాటను కూడా రాయించాడు. ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికలో 'అప్పల్రాజు' చిత్రానికి సంబంధించి ఓ ఫోటో విడుదలైంది. గదతో తొడపై సునిల్ కొడుతున్న ఫోటో అది. తెలుగులో వచ్చిన అనేక చిత్రాల్లో ఓ ప్రముఖ హీరో తొడగొట్టి డైలాగులు వదిలే సన్నివేశాన్ని వెక్కిరించడమే దీని ఉద్దేశమని ఇండిస్టీ టాక్ !తాజాగా మరో హీరోపై బాణం వదిలాడు వర్మ. కొందరు హీరోలు రెగ్యులర్‌గా పెట్టుకునే టైటిల్స్‌పై రాము కామెడీ చేస్తున్నాడు. ఇడియట్, ఖతర్నాక్, బలాదూర్ వంటి టైటిల్స్‌తో రవితేజ పాపులర్ అయ్యాడు. అయితే తన అప్పల్రాజు చిత్రంలో రవితేజ హీరోగా 'ఎదవ' అనే పోస్టరు వేయించాడు. దానికి 'చాలా మంచోడు' అనే వెటకారపు ట్యాగ్‌లైన్ కూడా జత చేశాడు. అంతేకాదు తెరవెనుకుండే టెక్నీషియన్లనూ వదలటం లేదు. ఛోటా.కె.నాయుడు అనే పేరుని తలపించేలా 'బాటా.కె.రాయుడు' అంటూ హాస్యం చేస్తున్నాడు. అలాగే ఓ వెబ్‌సైట్ పేరు ఐడిల్‌బ్రెయిన్. సినిమా వార్తలు, సమీక్షలు తదితర సమాచారం ఇందులో అందిస్తున్నారు. దీన్ని వర్మ తన చిత్రంలో 'హాఫ్‌బ్రెయిన్' అంటూ వెక్కిరించనున్నాడు. కేవలం రవితేజ ఒక్కడి మీదే కాకుండా తెలుగు పరిశ్రమలోని టాప్ హీరోస్ అందిరిపైనా రాము సెటైర్లు నేరుగా విసరబోతున్నాడు. |
0 comments:
Post a Comment