* నవంబర్ 8లోగా లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు
సత్యం రామలింగ రాజుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై హాయిగా జీవితం గడుపుతున్న అతనికి గడ్డుకాలం మొదలైంది. అతనికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రామలింగరాజుతో పాటు మరో అయిదుగురి బెయిల్‌ను సైతం రద్దు చేసింది.
అంతే కాకుండా వీరంతా నవంబర్ 8లోపు సిబిఐ ఎదుట లొంగిపోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణను వచ్చే ఏడాది జూలై 31లోపు పూర్తి చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును సుప్రీం ఆదేశించింది. దీంతో రామలింగరాజు మరికొన్నాళ్లు జైలు జీవితం గడపక తప్పదు.
0 comments:
Post a Comment