Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, October 18, 2010

అందరి కళ్లూ కర్ణాటక హైకోర్టు తీర్పుపైనే కేంద్రీకృతం!

కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు భవితవ్యం సోమవారం తేలనుంది. 16 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనుంది. దీంతో అందరి దృష్టీ హైకోర్టు తీర్పుపై కేంద్రీకృతమైవుంది. 

మంత్రివర్గంలో నలుగురు మంత్రులను ముఖ్యమంత్రి యడ్యూరప్ప తొలగించడంతో ఆ రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వానికి చిక్కులు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా 19 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయగా, వీరిలో నలుగురు తిరిగి సొంత పార్టీ శరణుజొచ్చారు. 

మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది భాజపా, ఐదుగురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా అనర్హతకు గురైన సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై గత వారంలో హైకోర్టులో వాదోపవాదాలు ముగిశాయి. ఈ కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు కోర్టు ప్రకటించింది. 

ఇదిలావుండగా, శాసనసభలో రెండుసార్లు విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న యడ్యూరప్ప.. 16 మంది సభ్యులు లేకుండానే విజయం సాధించారు. అయితే, సోమవారం కోర్టు అనర్హతకు గురైన సభ్యులను కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించాలని ఆదేశిస్తే మాత్రం యడ్యూరప్ప సర్కారు కూలిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠత నెలకొనివుం

0 comments:

Post a Comment