Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 12, 2010

బెంగళూరు టెస్టు: సచిన్‌ ఖాతాలో ఆరో డబుల్ సెంచరీ!


అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డును సృష్టించాడు. బెంగళూరులో ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా మాస్టర్ అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో ఆరో డబుల్ సెంచరీ సాధించినట్లైంది. 
ఇంకా ఆస్ట్రేలియాపై మాస్టర్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. రెండో టెస్టు నాలుగో రోజైన మంగళవారం సచిన్ టెండూల్కర్ 337 బంతుల్లో 200 పరుగులు సాధించాడు. దీంతో ఇదే ఏడాది మాస్టర్ రెండో డబుల్ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 
కాగా, 435/5 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ బుల్లోడి సెంచరీతో 470 పరుగుల భారీ స్కోరును నమోదు చేసుకుంది. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ 207 (347 బంతుల్లో 22 ఫోర్లు 2 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోనీ (21)లు క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ 130.4 ఓవర్లలో 5 వికెట్ల పతనానికి 470 పరుగుల భారీ స్కోరును నమోదు చేసుకుంది.

0 comments:

Post a Comment