Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 12, 2010

భారత్ విజయలక్ష్యం 207: 7 పరుగులకే సెహ్వాగ్ అవుట్!



భారత్‌తో బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా జట్టు 223 పరుగులకే ఆలౌటైంది. 202/ 7 స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 223 పరుగుల వద్ద అన్ని వికెట్లు కోల్పోయింది. ఫలితంగా భారత్‌కు 207 స్వల్ప పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది.
202/7 స్కోరుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం పది పరుగులు సాధించేలోపే జాన్సన్ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం హిల్ఫెన్హస్ పరుగులేమితో అవుటయ్యాడు. జాన్సన్‌ను జహీర్ ఖాన్ పెవిలియన్ చేర్చగా, హిల్ఫెన్హస్‌కు శ్రీశాంత్ అవుట్ చేశాడు.
తర్వాత బరిలోకి జిగిన పీటర్ జార్జ్ కూడా జహీర్ ఖాన్ బౌలింగ్‌లో డకౌట్‌తో వెనుదిరిగాడు. దీంతో బుధవారం ఆట ప్రారంభమైన ఒక గంటలోపే ఆసీస్ మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వరకు పోరాడిన హారిడ్జ్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, ఓజాలు చెరో మూడేసి వికెట్లు పడగొట్టగా, శ్రీశాంత్, భజ్జీలు చెరో రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

తదనంతరం 207 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 7 పరుగులకే అవుటయ్యాడు. కేవలం ఆరు బంతులాడిన సెహ్వాగ్, హిల్ఫెన్హస్ బౌలింగ్‌లో పైనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం మురళీ విజయ్ (13), పూజారా (5)లు క్రీజులో ఉన్నారు. ఫలితంగా భారత్ 4.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు సాధించింది.

0 comments:

Post a Comment