Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 12, 2010

19 ఏళ్ల తర్వాత ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు చోటు

ఎట్టకేలకు దాదాపు 19 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు మరోసారి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో స్థానం లభించింది. ఐరాస భద్రతా మండలిలోని అశాశ్వత కోటాలో భారత్‌కు ఈ సభ్యత్వం లభించింది. భారత్‌తో పాటు జర్మనీ, దక్షిణాఫిక్రా, కొలంబియా, పోర్చుగల్ దేశాలు కూడా ఐరాస భద్రతా మండలికి ఎన్నికయ్యాయి.

కాగా.. ఈ సభ్యత్వం కోసం పోర్చుగల్‌తో పోటీపడ్డ కెనడా నిష్క్రమించింది. ఐరాస భద్రతా మండలి చోటు సంపాధించిన ఈ కొత్త దేశాలు వచ్చే ఏడాది జనవరి నుంచి ఐరాస భద్రతా మండలి సభ్యత్వాన్ని పొందుతాయి. ఆస్ట్రియా, జపాన్, మెక్సికో, టర్కీ, ఉగాండాల స్థానే ఈ తాజా ఎన్నిక జరిగింది. 

భారత్ దాదాపు 20 సవత్సరాల తర్వాత భద్రతా మండలిలో సభ్యత్వం పొందింది. దీంతో ఐరాస సంస్కరణల కోసం మరింతగా కృషి చేసే అవకాశాన్ని భారత్ సంతరించుకుంది. కాగా ఈ సభ్యత్వం విషయంలో ఐరాసలోని 187 దేశాలు భారత్‌కు మద్దతు తెలుపగా.. మూడు దేశాలు మాత్రం వ్యతిరేకించాయి

0 comments:

Post a Comment