పార్లమెంట్ సమావేశాలు తర్వాత విజయనగరం జిల్లాలో కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను చేపట్టనున్నట్టు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
దీనిపై ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఓదార్పు యాత్రను నిలుపుదల చేసే ప్రసక్తే లేదన్నారు. ఓదార్పుయాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై అధిష్టానం ఎటువంటి చర్య తీసుకోదన్నారు. కొందరు కావాలనే ఓదార్పుయాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.
తన తండ్రి హఠాన్మరణం అనంతరం మృత్యువాత పడిన కుటుంబ సభ్యులను పరామర్శించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకుంటుందనే తలంపు ఎందుకు వస్తుందన్నారు. కొంతమంది చేసే అసత్య ప్రచారం వల్లే మీడియా ఇలాంటి ప్రశ్నలు వేస్తోందన్నారు.

0 comments:
Post a Comment