కర్ణాటకలోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీఎస్‌లో ప్రధాన కారణమన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. జేడీఎస్‌తో కలిసి ఈ జిమ్మిక్కులకు పాల్పడుతోందన్నారు. సోమవారం జరిగే బలపరీక్షలో తప్పకుండా యడ్యూరప్ప విజయం సాధించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మాత్రం వేటు తప్పది ఆయన హెచ్చరించారు.
జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేసి కిడ్నాప్ చేశారని వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఇటీవలి కాలంలో కర్ణాటకలో 16 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని వెంకయ్య గుర్తు చేశారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment