రాష్ట్ర రాజకీయ నేతలను కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికమించి పోయారు. ఇప్పటికే ఓదార్పు యాత్రలో మంచి ప్రజాధారణ కలిగిన నేతగా పేరు సంపాదించుకున్న జగన్ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఆదాయపన్ను చెల్లింపులో రాష్ట్ర రాజకీయ నేతలందరినీ అధికమించిపోయారు. గత ఆర్థిక సంవత్సరంలో 84 కోట్ల రూపాయలను ఆదాయపన్ను రూపంలో చెల్లించారు. ఈ మొత్తం అంతకుముందు సంవత్సరం చెల్లించిన మొత్తం కంటే 12.53 రెట్లు అధికం కావడం గమనార్హం.
ప్రధానంగా ఇనుప ఖనిజ వ్యాపార రారాజులుగా వెలుగొందుతున్న కర్ణాటక మంత్రులు గాలి బ్రదర్స్ కంటే జగన్ మొదటి స్థానాన్ని ఆక్రమించుకోవడం విశేషం. ముఖ్యమంత్రి పగ్గాలను రోశయ్య చేపట్టిన తర్వాత జగన్ ఆస్తులు పెరిగాయా అనే సందేహం కలిగించే రీతిలో పన్ను చెల్లించడం గమనార్హం. 2008-09 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.
ఆసమయంలో కేవలం 6.7 కోట్ల రూపాయలను మాత్రమే పన్ను చెల్లించిన జగన్.. 2009-10 సంవత్సరంలో ఏకంగా 87 కోట్ల రూపాయలను చెల్లించడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశమేమిటంటే.. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన గాలి జనార్ధన్ రెడ్డి తన భార్య మీద చేస్తున్న మైన్స్ వ్యాపారానికి గాను కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే పన్నుచెల్లిస్తున్నారు.
0 comments:
Post a Comment