కొమరం భీమ్ విగ్రహం ఏర్పాటుపై నెలకొన్న వివాదంపై కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజన పోరాట యోధునికి హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒర అంగుళ స్థలం లేదని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నట్టు చెప్పారు. కొమరం భీమ్ విగ్రహం ఏర్పాటుకు కొంత గడువు ఇస్తున్నామని, ఆ గడువులోగా ఏర్పాటు చేయకపోతే.. తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్రానేతల విగ్రహాలు ఎపుడు పగులుతాయో.. ఎలా పగులుతాయే మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని 10 జిల్లాల ప్రజలు కొమురం భీంను స్మరించుకోవాలన్నా.. పూలదండ వేయాలన్నా ఒక్క విగ్రహం కూడా లేకపోవడాన్ని తప్పుపట్టారు. కొమురం భీం విగ్రహం ఏర్పాటు చేస్తామని జీవో జారీ చేసిన ప్రభుత్వానికి హైదరాబాద్‌లో స్థలమే దొరకట్లేదా అని ప్రశ్నించారు.
0 comments:
Post a Comment