Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Saturday, October 30, 2010

రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘోర అవమానం


హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్శిటీలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని తగులబెట్టేందుకు దుండగులు యత్నించారు. అయితే అక్కడే ఉన్న కొందరు చూసి వెంటబడటంతో వారు పరారయ్యారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 

ఈ సంఘటనపై సీమాంధ్ర ప్రాంత జేఏసీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి తెలుగు జాతికోసం ప్రాణాలర్పించిన మహా నాయకుడి విగ్రహంపై పెట్రోలు పోసి దగ్ధం చేయాలని చూడటం మహా పాపమనీ, అది ఊరికే పోదని శాపనార్థాలు పెట్టారు. 

కాగా తెలంగాణాకు చెందిన కొన్ని జేఏసీలు మాత్రం ఆ పని తెలంగాణావాదులు చేసి ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. అదేసమయంలో తెలంగాణావాదుల ముసుగులో సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కూడా చేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని వెల్లడించాయి.

కాగా గత రెండు మూడు రోజులుగా ఓ పార్టీకి చెందిన నాయకులు ఆంధ్ర నాయకుల విగ్రహాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

ఏదేమైనా విడిపోవాలనుంకుంటే సామరస్యపూరితమైన వాతావరణం ఉంటేనే సాధ్యమవుతుందనీ, ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తే లక్ష్యం నెరవేరడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

0 comments:

Post a Comment