ప్రముఖ ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరి హత్య కేసుప్రధాన నిందితుడు అయిన భాను కిరణ్ ను అరెస్టు చేసినట్లు వచ్చిన సమాచారం పోలీసు వర్గాల ప్రతిష్ట పెంచేదిగా ఉంది. గత ఏడాది జనవరిలో సాయంత్రం వేళ కారులో సూరిని హత్య చేసి పరారైన భాను ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టారు. ఎప్పటికైనా పట్టుకుంటామని డిజిపి దినేష్ రెడ్డి గతంలో ప్రకటించారు. అదే విధంగా మొత్తం మీద రకరకాల కూపీ ద్వారా బానును అరెస్టు చేయగలగడం ఆంధ్రప్రదేశ్ పోలీసుల చరిత్రలో ఒక మైలు రాయి వంటిదేనని చెప్పాలి. భానుతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కూడా సంబందాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరు సినీ రంగ ప్రముఖులను కూడా కబ్జా , బెదిరింపు కేసులలో అరెస్టు చేశారు. మొత్తంమీ భాను అనుచరులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చివరికి ఏడాది తర్వాత భానును చాకచక్యంగా పోలీసులు పట్టుకోగలిగారు.ఈ కేసులో రాష్ట్ర మంత్రి కుమారుడు ఒకరికి నేరుగా సంబంధాలు లేకపోయినా, అతని స్నేహితుడు ఒకరితో తనకు పరిచయం భాను వాడుకున్నాడని అబియోగాలు ఉన్నాయి. బాను ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారో ఆసక్తికరంగా ఉంటుంది.
0 comments:
Post a Comment