తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఒక దొంగ అని, ఆయన గత యేడాది డిసెంబరులో చేపట్టిన నిరాహారదీక్ష కూడా ఓ మోసపూరితమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఆరోపించారు. ఆయన ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో అన్ని రకాల విటమిన్స్ అందాయన్నారు.
అది నిజమైన దీక్ష కాదన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రజాఫ్రంట్‌తో కేసీఆర్‌కు దిక్కుతోచడం లేదన్నారు. అందుకే మరోమారు ఆమరణదీక్ష చేపట్టేందుకు సై అంటూ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారని గోనే ఆరోపించారు.
కేసీఆర్‌ను నిమ్స్ ఆస్పత్రిలో చేరిన తర్వాత అన్ని రకాల విటమిన్స్ అందుతున్న విషయం ప్రభుత్వానికి బాగా తెలుసన్నారు. ఈ విషయాలను కావాలనే కొంతమంది నేతలు కేంద్రానికి తెలియజేయలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఇక్కడ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని గోనే ప్రకాశ రావు ధ్వజమెత్తారు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment