Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 26, 2010

మంత్రులూ.. రాష్ట్ర అవతరణోత్సవాల్లో పాల్గొంటే... ఖబడ్దార్!!

ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ మరోసారి సచివాలయం ముట్టడికి యత్నించింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. దీంతో సచివాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో రాష్ట్ర మంత్రులెవరైనా పాల్గొంటే ఖబడ్దార్ అని హెచ్చరికలు చేశారు. 

నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించాలని పిలుపునిచ్చారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా ఉత్సవాలను చేసినట్లయితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 

డిసెంబరు నెలాఖరు నాటికి శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాకు అనుకూలంగా నివేదిక ఇస్తే సరే... లేదంటే తెలంగాణాప్రాంత ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

0 comments:

Post a Comment