ఆ వస్తువుల కోసం ట్రస్టు ఏర్పాటు చేసిన వేలంపాటలో మాస్టర్ బ్యాటే భారీ విలువ పలికిందని నిర్వాహకులు చెప్పారు. కివీస్‌తో క్రిస్ట్‌చర్చ్ మైదానంలో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 163 పరుగులు సాధించాడు. భారీస్కోరు కోసం సచిన్ ఉపయోగించిన బ్యాటే రూ.42 లక్షలు పలికిందని ట్రస్టు నిర్వాహకులు వెల్లడించారు.
కాగా మాజీ రగ్భీ ఆటగాడు, నటుడైన రాహుల్ చేతుల మీదుగా ఆరంభమైన ట్రస్టుకు చేయూతనిచ్చే విధంగా 25 మంది ప్రముఖ ఆటగాళ్లు తమ ఉపకరణాలను దానంగా ఇచ్చారు. ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్ల ఉపకరణాలకు నిర్వహించిన వేలం పాటలో సచిన్ బ్యాట్ మాత్రమే భారీ ధర పలికింది. ఈ వేలం పాటలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్, విక్టోరియా జట్టు టీ షర్ట్ కూడా చోటు చేసుకుంది.
ఇకపోతే.. భారత్‌కు చెందిన ఏకైక ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా పిస్టోల్, రాహుల్ ద్రావిడ్ 2005వ సంవత్సరం పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో సెంచరీలు సాధించిన బ్యాట్ సైతం రూ.20లక్షల పలికింది. మరోవైపు 1983వ సంవత్సరం కపిల్ దేవ్ కెప్టెన్‌గా భారత్ ప్రపంచకప్ సాధించిన తరుణంలో క్రికెటర్లందరూ సంతకాలు చేసిన బ్యాట్‌ను సైతం సునీల్ గవాస్కర్ ఈ ట్రస్టుకు అందజేశారు. ఈ బ్యాట్ రూ.17.5 లక్షలు పలికింది.
అలాగే అనిల్ కుంబ్లే పది వికెట్లు సాధించిన తరుణంలో ధరించిన డ్రస్, ఆతని టెస్టు టోపీ సైతం రూ.11.5 లక్షలు పలికింది. ఇదేవిధంగా స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ బూట్లు, సానియా మీర్జా వింబుల్డన్ బ్యాట్, సైనా నెహ్వాల్
బ్యాట్, లియాండర్ పేస్ వింబుల్డన్ బ్యాట్‌లు కూడా భారీ ధర పలికాయి
0 comments:
Post a Comment