Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Friday, October 15, 2010

చిరంజీవి తెలంగాణ పర్యటనను వాళ్లే అనుమతించాలి: గద్దర్


ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలంగాణ పర్యటనను అనుమతించాలా లేదా అనేది ఆ ప్రాంత ప్రజలే నిర్ణయిస్తారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు, విప్లవ గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. తెలంగాణలో చిరంజీవిని తిరగనిచ్చే అంశంపై ఆ ప్రాంత వాసులే నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. 

అలాగే ఎన్నికల్లో పోటే చేయాల్సిందేనని కొందరు భాగస్వాములు కోరుతున్నారని, దీన్ని టిపిఎఫ్ దృష్టిలో పెట్టుకుందన్నారు. ఎన్నికలు సమీపించినప్పుడు తగిన నిర్ణయం టీపీఎఫ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని గద్దర్ చెప్పారు. టీపీఎఫ్ ఎన్నికల్లో పోటీచేయాలని కోరుతున్నవారందరూ టీపీఎఫ్‌తో కలిసి పనిచేయడాన్ని కొనసాగించాలని గద్దర్ కోరారు. 

ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తేలడమే తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏకైక లక్ష్యమన్నారు. అలాగే విభజన కోరుతున్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను ప్రోత్సహించి, త్వరలో పీపుల్స్ ఫ్రంట్‌లుగా ఏర్పాటు చేసి, రాష్ట్ర విభజన ఉద్యమంలో భాగస్వాములను చేయనున్నట్లు గద్దర్ అన్నారు.

0 comments:

Post a Comment