ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ రామ్గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర చిత్రం మొదటి భాగం (పార్ట్-1)పై మద్దెలచెరువు సూరి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన స్నేహితులతో కలిసి గురువారం రాత్రి బెంగుళూరులో రక్తచరిత్ర ప్రివ్యూ షోను తిలకించారు.
ఈ షో ప్రదర్శన అనంతరం సూరీ మీడియాతో మాట్లాడుతూ.. మొదటి భాగం సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ చిత్రంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవన్నారు. యధార్థ సంఘటనలకు కాస్త కల్పితాలను కూడా జోడిస్తామని దర్శకుడు వర్మ ముందు నుంచే చెపుతూ వచ్చారని, అదేవిధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయన్నారు.
ఈ చిత్రంలో ఏ ఒక్కరినీ కించపరచడం లేదా ఎక్కువ చేసి చూపడం వంటివి జరుగలేదన్నారు. అందువల్ల మొదటి భాగంపై తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ చిత్రం రెండో భాగంపై ఎలా ఉంటుందో చూస్తే గానీ తన పూర్తి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనన్నారు.

0 comments:
Post a Comment