అధిష్టానం మాటవినకుండా తన దారి రహదారి అన్నట్లు వ్యవహరిస్తున్న కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డిని పట్టించుకోవద్దని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు సూచించినట్లు తెలిసింది. అలాగే జగన్ ఓదార్పు యాత్ర గురించి సోనియా గాంధీ అంతగా పట్టించుకోవద్దని సూచించినట్లు సమాచారం.
సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య సోనియాతో జరిగిన సమావేశంలో జగన్ ఓదార్పు యాత్ర విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మేడమ్ మాత్రం ఆ చిన్నపిల్లోడిని అంతగా పట్టించుకోవద్దయ్యా! అన్నట్లు తెలిసింది. అయితే జగన్ అనుకూలంగా ఉన్న మంత్రులపై మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని సీఎంతో సోనియా గాంధీ చెప్పారు.
ఈ క్రమంలో బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు మాత్రం మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను స్వయంగా అధిష్టానం తన మీద వేసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాలపై సోనియా గాంధీ పూర్తిగా గవర్నర్ నరసింహన్ మీద ఆధారపడినట్లు తెలుస్తోంది.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment