రాష్ట్రమంత్రి బాలినేని శ్రీనివాసరావు వైఎస్ జగన్ రాజకీయ భవితవ్యం గురించి విపులీకరించారు. రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోశయ్య ఇప్పటికి.. అంటే 2014 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. ఆ తర్వాత అంటే... 2014లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
నిజానికి ముఖ్యమంత్రి రోశయ్య కుర్చీలో కూచోవాలని ఆయన వెంట ఉన్న సీనియర్ నాయకులే కొందరు ఆరాటపడుతున్నారన్నారు. కానీ తామలా కాదన్నారు. మరో ఏడాదిన్నర కాలం పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు సాగుతుందనీ, ఇక చివరిగా రెండేళ్లు మిగిలి ఉంటుంది కనుక 2014 నాటికి పూర్తిస్థాయిలో జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూచోబెట్టే కసరత్తు సాగుతుందన్న ధోరణిలో ఆయన మాట్లాడారు.
మొత్తమ్మీద వైఎస్ జగన్ ఓదార్పు ఎంతకాలం సాగుతుందోనని ఆలోచిస్తూ బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నవారికి మంత్రి బాలినేని మంచి కబురు చెప్పారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment