'కత్తి' టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఆల్రెడీ గత కొంతకాలంగా నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రానికి కత్తి అనే టైటిల్‌ను పెడుతున్నట్లు వివిధ ప్రకటనల్లో బయటకు వచ్చింది. కానీ తాము రవితేజతో తీయబోయే తాజా చిత్రానికి కత్తి అనే టైటిల్ పెట్టామని దర్శకుడు గుణశేఖర్ శనివారం వెల్లడించారు. త్వరలో పాటల రికార్డింగ్ కూడా జరుపుకోబోతోంది అని చెప్పారు.
వివాదం గురించి మాట్లాడుతూ... 'కత్తి అనే టైటిల్‌ను నేను మూడు నెలల క్రిందటే ఛాంబర్లో రిజిష్టర్ చేసుకున్నాను. ఛాంబర్లో ఈ విషయమై చర్చించాం. ఛాంబర్ కార్యదర్శి దిల్ రాజు ఈ విషయాన్ని పరిశీలించి, కత్తి టైటిల్ నందమూరి కల్యాణ్ రామ్ సినిమాకు రిజిష్టరై లేదని చెప్పారు. కనుక మీ టైటిల్ మీకే ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ తాజాగా కల్యాణ్ రామ్ చిత్రానికి కత్తి అని పేరు బయటకు వచ్చింది.
ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గనుక కత్తి టైటిల్ పెట్టుకుంటే... కత్తి కాంతారావు టైటిల్ తరహాలో కల్యాణ్‌రామ్ కత్తి అనేలా పెద్ద లెటర్స్‌లో పెట్టుకోండి. అన్యదా భావించవద్దు. మా చిత్రానికి కత్తి అనే టైటిల్ పెట్టాం. ఈ కథ రవితేజకు నచ్చి చేయడానికి కూడా సిద్ధమయ్యారు. వచ్చే నెల పాటల రికార్డింగ్ ప్రారంభమవుతోంది. ఏప్రియల్లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుంద'ని చెప్పారు.

0 comments:
Post a Comment