తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఏమీ అనలేని దయనీయ స్థితిలో తాము ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు.. సీమాంధ్ర ప్రాంతాల్లో పార్టీ మనుగడ తమకు ముఖ్యమన్నారు. అందువల్ల మీడియా కూడా తమను అర్థం చేసుకోవాలని ఆయన ప్రాధేయపడ్డారు.
ఆయన శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. చంత్రబాబు నాయుడు పార్టీ అధినేతగా ఇరు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన ఏనాడూ వ్యతిరేకం అని చెప్పలేదని గుర్తు చేశారు.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటే చంద్రబాబు ఏమైనా కాదంటారా అని ఆయన ప్రశ్నించారు. అసలు తమ ప్రాంతానికి మొట్టమొదట ద్రోహం చేసింది తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని నాగం ఆరోపించారు. ఇపుడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటుంది తెరాస అధినేత చంద్రశేఖర్ రావున్నారు.

0 comments:
Post a Comment