తెలంగాణా రాష్ట్ర సమితికి గ్రహణం పట్టుకున్నట్లు కనబడుతోంది. గద్దర్ తెలంగాణా ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి కేసీఆర్ ముఖంలో మునుపటి ధీమా కనబడటం లేదు. దీనికితోడు ఆయన కుమారుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లా పేరును కొమరం భీమ్ జిల్లాగా పేరు మార్చాలని చేసిన సూచనపై తెలంగాణాలోని ముస్లిములు మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణా ముస్లిం ఫ్రంట్ మాట్లాడుతూ... మా సామ్రాజ్యాన్ని కోల్పోయాం. నిజాం ప్రభుత్వం ఉన్నపుడు తమకు దక్కిన హక్కుల అన్నిటినీ నష్టపోయాము. ఆనాడు ముస్లిం రాజులు తమ పరిపాలనా దక్షతకు గుర్తుగా పెట్టుకున్న పేర్లను ఒకటొకటిగా మార్చడానికి కొన్ని పార్టీలు చూస్తున్నాయి.
బీజాపూర్ రాజధానిగా చేసుకుని తెలంగాణా, రాయలసీమ, కర్నాటక ఉత్తరప్రాంతం, మహారాష్ట్రలోని కొంత భాగాన్ని ఏలిన మహ్మద్ ఆదిల్ షా జ్ఞాపకార్థం ఆదిలాబాద్ పేరును పెట్టారనీ, ఇపుడా పేరు స్థానంలో కొమరం భీం జిల్లా అని చేర్చాలంటున్న తెరాస సూచనలను తాము ఖండిస్తున్నామన్నారు.

0 comments:
Post a Comment