skip to main |
skip to sidebar
4:35 AM
apsensational
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా జహీర్‌బాద్ వద్ద అతడిని అరెస్ట్ చేసినట్టు సమచారం. స్నేహితుడికి రాసిన లేఖల ఆధారంగా అతడి ఆచూకీ కనుగొన్నట్టు తెలుస్తోంది. భాను అరెస్ట్‌ను సీఐడీ ఐజీ రమణమూర్తి ధ్రువీకరించారు. సాయంత్రం 5.30 గంటలకు అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముందని పోలీసులు అంటున్నారు. గతేడాది జనవరి 3న సూరి హత్యకు గురయిన తర్వాత భాను పరారయ్యాడు. అప్పటినుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. రెండుమూడు సార్లు అతడు దొరికినట్టు పుకార్లు వచ్చాయి. భాను నోరు విప్పితే సూరి హత్యకు గల కారణాలు వెలుగుచూసే అవకాశముంది.
Posted in:
0 comments:
Post a Comment