Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 12, 2010

వారిని నేనంత సులభంగా వదిలిపెట్టను: యడ్యూరప్ప


తన ప్రభుత్వాన్ని కూలకొట్టడానికి ప్రయత్మించిన అసమ్మతి ఎమ్మెల్యేలను అంత సులభంగా వదిలిపెట్టనని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప అన్నారు. ప్రతిపక్ష జనతాదళ్ (సెక్యులర్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారని యడ్యూరప్ప ఆరోపించారు. 

సోమవారం మూజువాణి ఓటుతో శాసనసభ విశ్వాసం పొందిన తర్వాత యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి ఉపయోగించిన 'ధన బలం’పై సమగ్ర విచారణ జరిపిస్తానని ప్రకటించారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు రూ. 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు చెల్లించారని ఆయన ఆరోపించారు. దీనిని బహిర్గతం చేయడానికి సమగ్ర విచారణకు ఆదేశిస్తానన్నారు. 

డబ్బులు గుంజుకుని ప్రభుత్వానికి కూలగొట్టడానికి ప్రయత్మించిన వారిని అంత సులభంగా వదిలిపెట్టనని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఒక్కో ఎమ్మెల్యేకు ఎంతిచ్చారు అనేది నాకు తెలుసు’ అని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. 

ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించడం ద్వారా జెడిఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తున్నారని యెడ్యూరప్ప ఆరోపించారు. వారు శాసనసభలో వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

మరోవైపు బీజేపీ ప్రభుత్వం కర్ణాటక శాసనసభ విశ్వాసం పొందిన తీరు రాజ్యాంగ వ్యతిరేకమని, అప్రజాస్వామికమని సీపీఎం పొలిట్ బ్యూరో సోమవారం ఒక ప్రకటనలో విమర్శించింది. ఈ విషయంలో బిజెపి అనుసరించిన తీరును సీపీఎం ఖండించింది.

0 comments:

Post a Comment