Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, October 13, 2010

స్టూడియోఎన్ ఉద్యోగుల తొలగింపు

హైదరాబాద్: స్టూడియోఎన్ చానెల్ ఒక్కసారిగా దాదాపు 70 మంది ఉద్యోగులను తొలగించింది. దసరా పండుగ సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులను విషాదంలో ముంచింది. కారణాలు చెప్పకుండా యాజమాన్యం వారిని తొలగించింది. స్టూడియోఎన్ సిఇఓ లోకేష్ తండ్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కావడంతో వారు ఆయనను కలిశారు. తమకు న్యాయం చేయాలని చంద్రబాబుకు ఉద్యోగులు ఒక లేఖ ఇచ్చారు. ఆయన అందుకు సరిగా స్పందించలేదు. అది తనకు సంబంధంలేదన్నారు.


తొలగించినవారిలో ఎక్కువ మంది తెలంగాణ జర్నలిస్టులే ఉన్నారని వారు తెలిపారు. ఉద్యోగులకు జర్నలిస్టు సంఘాలు మద్దతు పలికాయి. రేపు ఉదయం లోపల వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి.

0 comments:

Post a Comment