Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 12, 2010

కడప ఎంపీకి కోట్ల ఆస్తి ఎలా వచ్చింది?: చంద్రబాబు ప్రశ్న

కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డికి కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 2004కు ముందు లక్షల్లో ఉన్న ఆస్తులు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే కోట్లకు కోట్లు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. కడప ఎంపీకి 84 కోట్ల రూపాయల పన్ను కట్టే ఆస్తి ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్సార్‌ను విమర్శిస్తే జగన్ వర్గం భుజాలు తడుముకుంటుందని, రాజశేఖర్ రెడ్డి ఏమైనా మహాత్మాగాంధీ కంటే గొప్పవాడా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని సంపద అంతా వైఎస్సార్ ఇంట్లోనే ఉందన్నారు. గత ఆరు సంవత్సరాలలోని వారి ఆస్తిని సంవత్సరాలవారిగా జగన్ ప్రజల ముందు వెల్లడించాలని బాబు డిమాండ్ చేశారు.మైక్రో ఫైనాన్స్ సంస్ధల వేధింపులతో మృతి చెందుతున్న వారి పాపం ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే మైక్రో సంస్థల దారుణాలు పెరుగుతున్నాయన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే మైక్రో పైనాన్స్‌లను ప్రమోట్ చేశారని విమర్శించారు. రాహుల్ సైతం వారి మృతికి బాధ్యత వహించాలన్నారు.

0 comments:

Post a Comment