కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదని గవర్నర్ భరద్వాజ్ అన్నారు. గతంలో ఒకసారి 50 మంది ఎమ్మెల్యేలను గాలి సోదరులు హైజాక్ చేశారని గవర్నర్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ మాఫియాతో, అవినీతితో విసిగిపోయిందని ఆయన అన్నారు. పనిలోపనిగా గాలి సోదరులపై గవర్నర్ విమర్శల వర్షం కురిపించారు.
ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికైన వారు ఎవరూ కర్ణాటకలో లేరని గవర్నర్ ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ ఏజెంట్‌ను అంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం బీజేపీ తీవ్ర మానసిక వేదనలో ఉందని అన్నారు. "నా విధి కర్ణాటక ప్రజలకు సేవ చేయడం. అంతేకానీ.. రాజకీయ పార్టీలకు, కొందరు వ్యక్తులకు కాదు.'' అని తేల్చి చెప్పారు.
రాష్ట్రపతి పాలన విధించాలని తాను చేసిన సిఫార్సు పక్షపాతమన్న ఆరోపణలను గవర్నర్ కొట్టిపారేశారు. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని కర్ణాటక సీఎం యడ్యూరప్పను కోరినట్లు గవర్నర్ వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు మరోసారి తన మెజార్టీని నిరూపించుకోవాల్సిందిగా తాను యడ్యూరప్పను కోరుతూ లేఖ రాసినట్లు భరద్వాజ్ అన్నారు.

0 comments:
Post a Comment