గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మింగుడు పడటం లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ విమర్శించారు. ముఖ్యంగా.. కాంగ్రెస్ కంచుకోటలుగా ఉండే మైనారిటీ వర్గ స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడటంతో కాంగ్రెస్ పార్టీ షాక్‌కు గురైందన్నారు.
ఈ ఫలితాలపై అద్వానీ తన బ్లాగులో స్పందించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థుల్లో వందమందికి పైగా విజయం సాధించరని, దీన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన కొంతమంది సీనియర్ నేతలను రాజీనామాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధికే పట్టం కట్టినట్లు ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లనూ తమ పార్టీ కైవసం చేసుకుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే, 53 మున్సిపాల్టీలకు గాను 42 స్థానాలు భాజపా ఖాతాలో చేరాయి.

0 comments:
Post a Comment