ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు కె.రోశయ్య ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొద్దిసేపట్లో రాజభవన్'కు వెళ్లి రాజీనామా పత్రాన్ని గవర్నర్'కు సమర్పిస్తానన్నారు. ఎమ్మెల్యేల బలం ఉండి తాను ముఖ్యమంత్రిని కాలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో ఈ పదవి తనకు లభించిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానని చెప్పారు. ఇప్పటి వరకు తనకు సహకరించినవారికి ఆయన కృతజ్జతలు తెలిపారు. వయోభారం, పనివత్తిడితోనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని చెప్పారు. తనకు ఇంతటి స్థానం కల్పించిన పార్టీని తాను వదలనని, ఓపిక ఉన్నంతవరకు పార్టీకి సేవ చేస్తానని ఆయన చెప్పారు. విలేకరుల సమావేశం అనంతరం గవర్నర్ నరసింహన్'కు రాజీనామా సమర్పించేందుకు ఆయన సచివాలయం నుంచి రాజభవన్'కు బయలుదేరారు. |
0 comments:
Post a Comment