జన హృదయ నేత వైఎస్సార్ మృతిని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వై.ఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో జరుగనుంది. తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి శుక్రవారం ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు ప్రయాణమయ్యారు.
అంతకుముందు జగన్ వైఎస్సార్ ఘాట్‌లో తండ్రికి నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లాలో నేటి నుంచి పదిరోజుల పాటు ఈ యాత్ర జరుగనుంది. గిద్దలూరు నుంచి పది గంటలకు ఆరంభమయ్యే ఈ యాత్రకు జగన్ వర్గం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిరోజు నాలుగు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
ఇదిలా ఉంటే.. ఓదార్పు యాత్రను ఆపేందుకు జగన్ ససేమిరా అన్నారు. అధిష్టానం ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని సైతం జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు అధిష్టానం దూతగా ఇడుపలపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ మాటలను కూడా జగన్ తోసిపుచ్చారు.
శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ప్రారంభించి తీరుతానని మొయిలీతో జగన్ స్పష్టం చేశారు. మాట తప్పడం.. మడమ తిప్పడం తమ ఇంటా వంటా లేదంటూ జగన్ తెగేసి చెప్పినట్లు సమాచారం

0 comments:
Post a Comment