Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Saturday, August 7, 2010

తిరుమల కొండపై కొండత అవినీతి: చంద్రబాబు ధ్వజం

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులపై కొండంత అవినీతి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తితిదే పాలక మండలిని ప్రక్షాళన చేసి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుమలలో చోటు చేసుకుంటున్న అవినీతి, నగల మాయం తదితర అంశాలపై తెదేపా మహాధర్నా, పాదయాత్రను శనివారం తిరుపతిలో చేపట్టిన విషయం తెల్సిందే. ఈ మహాధర్నాలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈ పవిత్రతను మంటగలిపేలా కొండపై అవినీతి జరుగుతోందన్నారు.

ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపవిత్రంగా మారిందన్నారు. డబ్బులున్న వారికే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోందన్నారు. మారుమూల పల్లె ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు దర్శనభాగ్యం లభించడం లేదన్నారు. ఈ పద్దతి మారి, ప్రతి ఒక్కరికీ దర్శనం కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

0 comments:

Post a Comment