నేనంటే గిట్టనివాళ్లు, కొన్ని పత్రికలు పనిగట్టుకొని తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కడప ఎంపీ వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పుయాత్రలో భాగంగా నాల్గోరోజు సోమవారం కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, పీసీ పల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పీసీ పల్లి మండలం మిట్టమీదపల్లి గ్రామంలో మృతి చెందిన కరణం వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని ఓదార్చారు.పలు గ్రామాల్లో వై.ఎస్ విగ్రహ ఆవిష్కరణలు చేశారు.పామూరు పట్టణంలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ నేను ఒంటరివాడిని కాదని, నా తండ్రి మరణిస్తూ తనకు పెద్ద కుటుంబాన్ని అప్పచెప్పారన్నారు. తనంటే గిట్టనివాళ్లు, కొన్ని పత్రికలు ఎంత చేసినా తనకు ప్రజలు మద్దతు ఉందన్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు నా చుట్టూ ఉంటేనేనా ప్రజలు తనపై ఆదరాభిమానాలు చూపేదని ప్రశ్నించారు.
గత పది నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుక దా అన్నారు. తన తండ్రి వై.ఎస్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పావురాళ్లగుట్టలో జగన్ ఇచ్చినమాటకు నిలబడి ఓదార్పుయాత్ర చేపట్టారని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఓదార్పుయాత్ర జరిగి తీరుతుందన్నారు. వై.ఎస్ అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పధకాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైవి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డిలు పాల్గొన్నారు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment