కాశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి చర్చలు ఒక్కటే పరిష్కారమార్గమని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఫలప్రదంగా జరగాలన్నా, ముగియాలన్నా హింస పూర్తిగా సద్దుమణిగి పోవడమే కాకుండా, సంఘర్షణకు తావులేని ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆయన అన్నారు.
కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై బుధవారం ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెల్సిందే. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రాజ్యాంగ పరిధిలో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఇందుకోసం హింసకు ప్రేరేపించని ఏ పార్టీతో అయినా, గ్రూపుతో అయినా చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ఆ రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీ నేతలు అమూల్యమైన సూచలనలు, సలహాలు ఇచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.
అలాగే, హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. గత కొంతకాలంగా చెలరేగిన అల్లర్లు, హింసాకాండ వల్ల అన్ని వర్గాల వారికి తీరని నష్టం జరిగిందని, అందువల్ల లోయలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment