తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేతులు కలపడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెరాస నేతలను కుక్కలతో పోల్చారు.
ఈ సందర్భంగా ఆయన తెరాస నేతలను కుక్కలతో పోల్చుతూ.. ఒక సామెతను గుర్తు చేశారు. "దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి" అనే సామెత తెరాస నేతలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందన్నారు. ఏపీపీఎస్సీ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ ఎపుడో విడుదలైతే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
గ్రూప్-1 పోస్టుల్లో 42 శాతం వాటాను కేటాయించాలని కేవలం ఐదారు రోజులుగానే డిమాండ్ చేశారని, అంతకుముందు వీరంతా ఏం చేస్తున్నారన్నారు. పరీక్షా తేదీని దగ్గర పడిన తర్వాతే వారికి ఈ విషయం గుర్తుకు వచ్చిందా అని శంకర్ రావు ప్రశ్నించారు.
ఇలాంటి తెరాస నేతలతో తమ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులు కలపడం దుదృష్టకరమన్నారు. అయితే, శంకర్ రావు వ్యాఖ్యలను కొంతమంది కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. తాము విద్యార్థులకు మాత్రమే సంఘీభావం ప్రకటించామన్నారు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment